పంజాబ్ సీఎం విదేశీ టూర్ కు కేంద్రం నో
posted on: Feb 9, 2026 12:31PM

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పింది. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ పొలిటికల్ క్లియరెన్స్ ను రిజెక్ట్ చేసింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం నో చెప్పడం ఇది మూడో సారి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే విదేశీ పర్యటనకు వెళ్లాలంటే విదేశాంగ శాఖ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ అనుమతినే పొలిటికల్ క్లియరెన్స్ అంటారు.
అయితే తరచుగా ఈ పొలిటికల్ క్లియరెన్స్ విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఇక తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాన్ పర్యటనపై కేంద్రం ఈ పొలిటికల్ క్లియరెన్స్ ను నిరాకరించడం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. మాన్ విదేశీ పర్యటనకు కేంద్రం వరుసగా మూడో సారి అనుమతి నిరాకరించడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో యూకే, ఇజ్రాయెల్ లో పర్యటించేందుకు మాన్ అనుమతి కోరగా కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకుండా నిరాకరించింది. అంతకు ముందు పారిస్ ఒలింపిక్స్ సందర్శనకు వెళ్లాలని భావించిన పంజాబ్ సీఎం మాన్ కు కేంద్రం అనుమతి ఇవ్వలేదు.
ఇప్పుడు తాజాగా పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం పెట్టుబడులను ఆహ్వానించడానికి భగవంత్ మాన్ చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్‌లో పర్యటించాల్సి ఉంది. పారిశ్రామికాభివృద్ధి, విద్య, విదేశీ పంజాబీల సహకారం కోసం మాన్ విదేశీ పర్యటనకు సంకల్పించారు. కేంద్రం క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఆయన పర్యటన రద్దైంది.



.webp)

.webp)


