అద్వానీకి చంద్రబాబు బర్త్ డే విషెస్

బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకుడు  లాల్ కృష్ణ అద్వానీ శనివారం (నవంబర్ 8) తన 98వ జన్మదినం జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా అద్వానీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. అద్వానీ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.  

1927 నవంబర్ 8వ తేదీన జన్మించిన అద్వానీ దేశంలో బీజేపీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు.  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి భారతీయ జనతాపార్టీని అభేద్యంగా తీర్చిదిద్దడంలో అద్వానీ పాత్ర అత్యంత ముఖ్యమైనది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు.  చంద్రబాబును బీజేపీకి విశ్వసనీయ మిత్రుడిగా అద్వానీ ఎప్పుడూ చెబుతుంటారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అద్వానీ హాజరైన సంగతి తెలిసిందే.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu