Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలుగు ప్రజలకు చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు
posted on: Mar 19, 2026 6:55AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఒక పోస్టులో షడ్రుచుల సమ్మేళనంతో వచ్చే ఈ ఉగాది పండుగ అందరి జీవితాలలో ఆనందాలను నింపాలని ఆకాంక్షించారు.
తెలుగు లోగిళ్లలో ఉగాది సంబరాలు మిన్నంటాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిం చాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన పీ4 విధా నాన్ని ప్రజలంతా అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకూ చేరడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్న చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయిలో అగ్రగామిగా నిలిపే క్రమంలో అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల తరహాలోనే జీవితంలోని ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపు నిచ్చారు.



.webp)


