సతీసమేతంగా లండన్ పర్యటనకు చంద్రబాబు
posted on Nov 1, 2025 3:55PM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనకు బయలుదేరారు. శనివారం (నవంబర్ 1) ఆయన తన సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ పర్యటనకు బయలు దేరారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని చెప్పవచ్చు. లండన్ లో భువనేశ్వరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి డిస్టింగ్విష్ డ్ ఫెలో షిప్ అవార్డు అందుకోనున్నారు. తన సతీమణి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆమెతో కలసి చంద్రబాబు లండన్ పర్యటనకు బయలు దేరారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ అయిన భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ, సామాజిక సాధికారతకు చేస్తున్న కృషికి గుర్తింపుగా 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025' అవార్డు అందుకోనున్నారు. అంతే కాకుండా ఇదే వేదికగా హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును ఆ సంస్థ ఎండీ హోదాలో అందుకోనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు కూడా లండన్ పర్యటనకు వెళ్లారు. పనిలో పనిగా అక్కడ పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖ వేదికగా జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానించే అవకాశం కూడా ఉంది.