హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపు చంద్రబాబు చలవే!

అరకు కాఫీ గురించిన ప్రస్తావన ఎక్కడ ఎప్పుడు వచ్చినా ఎవరైనా సరే చంద్రబాబును ప్రస్తుతించకుండా ఉండరు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారనడంలో సందేహం లేదు. అయితే అంతకు చాలా కాలం ముందే హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి చంద్రబాబు కృషి చేశారు. ీ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.  . అవును  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ బిర్యానీని ప్రమోట్ చేసింది తానేనని చెప్పారు. అంతే కాదు.. దేశ విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చే పర్యాటకులు పాత బస్తీలో షాపింగ్ చేసేలా అక్కడి ముత్యాల గురించి ప్రమోట్ చేసింది కూడా తానేనని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ వేల్యూను పెంచేందుకు తీసుకున్న అనేక చర్యలలో భాగంగా హైదరాబాద్ బిర్యానీ, పాతబస్తీ ముత్యాలను ప్రమోట్ చేశానన్నారు.

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను హైదరాబాద్ ను ఐటీ హబ్ గా ప్రపంచ దేశాల ప్రముఖ ఐటీ సంస్థలన్నీ హైదరాబాద్ కు క్యూకట్టేలా చేసేందుకు కృషి చేశాననీ, అలాగే హైదరాబాద్ బ్రాండ్ ను ఇనుమడింపచేసేలాంటి హైదరాబాద్ బిర్యానీనీ, ఓల్డ్ సిటీలో ముత్యాల షాపింగ్ ను కూడా ప్రమోట్ చేశానని చెప్పారు.  విజయవాడలో జరిగిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో మాట్లాడిన చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధిలో తన ముద్ర చెరిపివేయలేనిదన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu