ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

posted on: Dec 15, 2025 9:22AM

ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్  పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం (డసెంబర్ 14) ఆవిష్కరించారు. ఇదే పుస్తకాన్ని 'విలీనం -విభజన' పేరిట ఎన్.అనురాధ తెలుగులోకి  అనువదించారు.

 ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన  అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన  22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ ను తెలుగులోని విలీనం- విభజన పేరిట అనువదించిన అనూరాధను అభినందించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...