విత్ మై ఓల్డ్ ఫ్రండ్.. ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్రస్టింగ్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మూడు దశాబ్దాల నాటి తన పాత స్నేహితుడి గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ స్నేహితుడు.. చంద్రబాబు సహాధ్యాయో, చిన్న నాటి స్నేహితుడో అనుకునేరు.. కానే కాదు.. ఆయన దాదాపు మూడు దశాబ్దాలు పాటు ఉపయోగించిన అంబాసిడర్ కారు గురించి, ఆ కారుతో తనకు ఉన్న అనుబంధం గురించి స్మరించుకున్నారు. గుర్తు చేసుకున్నారు.  

ఏపీ 09 జి 393 నెంబరుతో ఉండే ఆ అంబాసిడర్ కారు చంద్రబాబు నాయుడి సొంత వాహనం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 393 నెంబర్ ఉన్న అంబాసిడర్ కాన్వాయిలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేవారు. 393 అంబాసిడర్ అంటేనే సీబీఎన్ బ్రాండ్ కార్ అనేలా ఈ కారు గుర్తింపు పొందింది. ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు... భధ్రతా పరంగా ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నా... ఆయన తన సొంత వాహనమైన  ఏపీ 09 జి 393  నంబర్ గల అంబాసిడర్ ను ఇప్పటికీ అపురూపంగానే చూసుకుంటున్నారు.

ఇప్పటి వరకు హైదరాబాదులో ఉన్న ఈ కారు ఇప్పడు అమరావతిలోని  తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంచారు. శుక్రవారం (అక్టోబర్ 31) పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు..  తిరిగి వెళ్తున్న సమయంలో ఆ అంబాసిడర్ కారును పరిశీలించారు. ఆ కారులో తన ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు. విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేసి ఆ కారుతో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu