Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రశ్న రావణ్ ను వెనకేసుకొస్తారా?.. వైసీపీపై చంద్రబాబు ఫైర్.!
posted on: Jul 10, 2026 2:29PM

ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 1న ఏపీ పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పటి నుండి, రాష్ట్రంలో రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు అరెస్టును ఖండిస్తూనో, సమర్ధిస్తూనే స్పందిస్తూనే ఉన్నారు. ప్రశ్నించే గొంతుకలను కూటమి ప్రభుత్వం అణచివేస్తోందంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఈ అరెస్ట్ అక్రమమంటూ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తడంతో ఈ చర్చనీయాంశంగా మారింది. ప్రశ్న రావణ్ అరెస్టుపై వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మీ భూమి - మీ హక్కు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు. పవిత్రమైన పురాణాలను, హిందూ సమాజ సెంటిమెంట్లను అత్యంత దారుణంగా దూషించడమే కాకుండా.. దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు, శత్రుదేశమైన పాకిస్తాన్‌కు అనుకూలంగా ఆ వ్యక్తి బహిరంగంగా మద్దతు తెలిపాడని చంద్రబాబు ఆరోపించారు.
ఇలాంటి దేశద్రోహ, మత విద్వేషపూరిత ఆలోచనలు ఉన్న వ్యక్తిని వెనకేసుకొస్తూ, అతడికి ప్రజాస్వామ్యవాదిగా రంగు పూసి రాష్ట్రంలో మళ్లీ మత కలహాలు రేపాలని వైసీపీ కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఆ నిందను తమపై వేస్తూ నారాసుర రక్తచరిత్ర అంటూ ఎలాగైతే విష ప్రచారం చేశారో.. ఇప్పుడు కూడా సరిగ్గా అదే ఫార్ములాను వాడుతున్నారన్నారు. ఇప్పుడు ప్రశ్న రావణ్‌ను అడ్డం పెట్టుకుని కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రభుత్వం సహించబోదని విస్పష్ట హెచ్చరిక చేశారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ గంజాయి, డ్రగ్స్, రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న చంద్రబాబు వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఆలయాలపై దాడులు జరిగాయని, రథాలను తగలబెట్టారని, అయినప్పటికీ నాటి జగన్ ప్రభుత్వం ఒక్కరిపై కూడా కఠిన చర్యలు తీసుకోలేకపోయిందని విమర్శించారు. రాయలసీమ ప్రాంతాన్ని తాము రతనాల సీమగా మార్చి అభివృద్ధి వైపు నడిపిస్తుంటే, వైసీపీ మాత్రం ఫ్యాక్షన్ రాజకీయాలతో రక్త చరిత్ర రాసేందుకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
Prashna Ravan Arrest, Banaganapalle AP Meeting, YSRCP Vs TDP Politics, Prakash Raj Tweets AP, Andhra Pradesh Latest News






