తప్పు చేస్తే వదలను.. తన, పర బేధం ఉండదు.. చేతలతో చెప్పిన చంద్రబాబు!

posted on: Apr 27, 2026 2:37PM

ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హుందాతనంతో మెలగాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే  చెబుతున్నారు. ఎవరైనా తప్పు చేస్తే తాను వదిలిపెట్టననీ, వారిపై చర్యలు తీసుకునే విషయంలో తన, పర బేధం చూడననీ స్పష్టం చేస్తున్నారు. ఆ విషయాన్ని మాటలతోనే కాకుండా చేతల ద్వారా చేసి చూపుతున్నారు.  తాజాగా తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఒక ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది.  కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కఠినంగా స్పందించారు.

తిరుపతి హైవేపై ఉన్న ఒక టోల్ ప్లాజా వద్ద  ఎమ్మెల్యే సురేంద్ర బాబు అనుచరులు, టోల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు సహనం కోల్పోయి, అక్కడి సిబ్బందిపై  భౌతిక దాడికి దిగారు. టోల్ చెల్లింపు విషయంలో లేదా వాహనం వెళ్లే క్రమంలో తలెత్తిన చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఎమ్మెల్యే అనుచరుల వీరంగమాడారు. ఇందుకు  సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల అనుచరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

ఈ వివాదంపై తక్షణమే విచారణ జరపాలని,  బాధ్యులైన వారిపై  కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులను   ఆదేశించారు. కేవలం ఆదేశాలతో ఆగకుండా..  కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును పిలిపించి చంద్రబాబు గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది. పార్టీ ఇమేజ్ దెబ్బతినేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదనీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

గతంలో వైసిపి నేతల అహంకారపూరిత ధోరణి వల్ల ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించున్న సంగతి తెలిసిందే. తప్పు చేసిన తమ పార్టీ నేతలను జగన్ వెనకేసుకు వచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అయితే  చంద్రబాబు మాత్రం అందుకు భిన్నం.  పాలనలో పారదర్శకత, అధికారుల పనితీరుపై నిరంతరం సమీక్షలు నిర్వహించడమే కాకుండా  ఇప్పుడు సొంత పార్టీ నేతలైనా సరే తప్పే చేస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు,  వారి అనుచరులు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతాన్ని తన తాజా చర్య ద్వారా చంద్రబాబు విస్పష్ట సంకేతం ఇచ్చారు. 

చంద్రబాబు ఆదేశాలతో కదిలిన పోలీసు యంత్రాంగం  టోల్ ప్లాజా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై   కేసులు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు అయినప్పటికీ.. వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడంతో పోలీసులు వేగంగా కదులుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...