ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే .. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై చంద్రబాబు
posted on: Feb 2, 2026 9:05AM
.webp)
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. జంతువుల కొవ్వుపై గతంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. . ఇటీవల ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికలో తిరుమల శ్రీవారి అడ్డూ ప్రసాదంలో వినియోగించినది అసలు నెయ్యే కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేతలు మాత్రం సిట్ చార్జిషీట్ లో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఆనవాళ్లే లేవని పేర్కొందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు తాజాగా స్పందించారు. గతంలో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాను తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పానని స్పస్టం చేశారు. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఈ నివేదిక స్పష్టం చేసిందన్నారు. దేశంలోనే అత్యంత విశ్వసనీయ ఎన్‌డీడీబీ నివేదికను ఎవరైనా చదువుకోవచ్చన్న ఆయన తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని.. తాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. తిరుమల లడ్డూ విషయంలోనే కాకుండా ఇంకా అనేక అంశాల్లో కూడా వైసీపీ హయాంలో అపచారాలు జరిగాయన్నారు.





.webp)

.webp)


