Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీమ్ ఇండియాకు చంద్రబాబు, లోకేష్ అభినందనలు
posted on: Mar 5, 2026 10:34PM
.webp)
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఉత్కంఠ పోరులో ఒత్తిడిని జయించి విజయం సాధించి ఫైనల్ కు చేరిన టీమ్ ఇండియాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ముంబై వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన రెండో సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. బంతి బంతికీ విజయం ఇరు జట్లతోనూ దోబూచులాడిన ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ లో విజయం సాధించిన టీమ్ ఇండియాను సామాజిక మాధ్యమ వేదికగా అభినందించారు.
వాట్ ఏ మ్యాచ్.. ఇదొక అద్భుతమైన విజయం అని చంద్రబాబు పేర్కొన్నారు. సంజు శాంసన్, శివమ్ దూబేలను ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ అభినందించారు. అలాగే , జస్ప్రీత్ బమ్రా, హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ ఫీల్డింగ్ అద్భుతమని ప్రశంసించారు.
అలాగే ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా టీమిండియా విజయాన్ని చిరస్మరణీయం అని పేర్కొంటూ అభినందించారు సంజు శాంసన్, శివమ్ దూబేల విధ్వంసకర బ్యాటింగ్, బుమ్రా అద్భుత బౌలింగ్, అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్ వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రశంసలు గుప్పించారు.



.webp)


