నారా రోహిత్ వివాహం..హాజరైన చంద్రబాబు, లోకేష్
posted on: Oct 31, 2025 7:10AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొదరుడు నారా రామ్మూర్తి నాయుడి కుమారుడు, నటుడు నారా రోహిత్ వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. చంద్రబాబు దంపతులు, లోకేష్ దంపతులు ఈ వివాహానికి హజరై వధూవరులు రోహిత్, శిరీషల ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు. మా ఇంట పెళ్లి సందడి.. మా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్, శిరీషల వివాహం ఘనంగా చేశాం అని పేర్కొన్నారు. ఈ వివాహవేడుక మా కుటుంబానికి ఒక పండుగ అంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ణతలు తెలిపారు.



.webp)



