Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జేడీ లక్ష్మినారాయణ.. పొలిటికల్ సన్యాసమేనా?
posted on: Feb 16, 2026 11:25AM
.webp)
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ రాజకీయ సన్యాసం తీసేసుకున్నట్లేనా? ఉద్యోగం వీడి రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తొలుత జనసేనలో చేరారు. అయితే సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ తన పనితీరుతో సామాన్యుల మన్ననలు, అభిమానం చూరగొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసు, ఓబులాపురం మైనింగ్ కేసులలో సీబీఐ జేడీగా ఆయన దర్యాప్తు సాగించిన తీరు పట్ల అప్పట్లో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా లంచాలు తీసుకున్న జడ్జిని కూడా పట్టుకుని తన నిజాయితీని చాటుకున్నారు.
ఆ తరువాత కారణాలేమైతేనేం.. ఆయన తన ఉన్నతోద్యోగాన్ని వీడి రాజకీయాలలోకి ప్రవేశించారు. 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తున్నారంటూ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొంత కాలం అటూ ఇటూ అంటూ ఊగి చివరికి సొంత పార్టీ కూడా పెట్టారు. అయితే రాజకీయాలలో ఆయనకు సక్సెస్ దక్కలేదు. అది పక్కన పెడితే.. ఇటీవల జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ మోసానికి గురై భారీగా నష్టపోయారు. దీంతో కుటుంబం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు ఇటీవల కొంత కాలంగా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా చేరారు. దీంతో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారన్న ఊహాగానాలకు బలం చేకూరినట్లైంది.
ఆయన మేఘా గ్రూపునకు చెందిన ఈవీ ట్రాన్స్ కంపెనీలో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ గా కొలువులో చేరారు. 2024 ఎన్నికల ముందు ఆయన జై భారత్ నేషనల్ పార్టీ ని స్థాపించి, విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక పాలిటిక్స్ తో లాభం లేదన్న నిర్ణయం వచ్చి మళ్లీ ఉద్యోగిగా కెరీర్ పై దృష్టి పెడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.



.webp)


