Latest News
కావేరి జలవివాదం.. మాజీ ప్రధాని నిరాహారదీక్ష
posted on: Oct 1, 2016 11:04AM

కావేరి జలాల వివాదం రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం పట్టింకోని నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆఖరిగా ఒక్క అవకాశం ఇచ్చింది. ఈరోజు నుండి 6 వ తేది వరకూ ప్రతిరోజు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు కావేరీ నదీ జలాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాజీ ప్రధాని దేవగౌడ ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బెంగుళూర్‌లోని అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు ఆయన దీక్ష చేపట్టారు. పలువురు కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు. కాగా గత కొద్దిరోజుల నుండి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నీటి జలాల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు చెబుతుంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడుకు కావేరీ జలాలను వదిలేది లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది.






