టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు నిషేధం.. ఎప్పటి నుంచంటే?

posted on: Apr 6, 2026 12:22PM

ఈ నెల  10 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు కేంద్రం  ప్రకటించింది. ఇకపై టోల్ రుసుమును కేవలం డిజిటల్ పద్ధతుల్లోనే చెల్లించాల్సి ఉంటుంది.  తాజా నిబంధనల ప్రకారం, వాహనదారులు టోల్ రుసుమును ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే, యూపీఐ ద్వారా సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది.

టోల్ ప్లాజాల వద్ద నగదు స్వీకరించే కౌంటర్లను ఈ నెల 10 నుంచి పూర్తిగా మూసివేయనున్నారు.  టోల్ మినహాయింపు  పరిధిలోకి వచ్చే ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు సైతం తమ వాహనాలకు తప్పనిసరిగా  ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్ తీసుకోవాలి. ఈ ప్రత్యేక ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ చెల్లిం చాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...