Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాతబస్తీలో హైడ్రామా…ఎంఐఎం ఎమ్మెల్సీపై కేసు
posted on: Apr 6, 2026 5:20PM
.webp)
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా అధికారులతో ఘర్షణ చోటుచేసుకోవడంతో ఎంఐఎం ఎమ్మెల్సీతో పాటు కార్పొరేటర్‌పై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పాతబస్తీలోని హుస్సేనాలెం సమీపంలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న ఎంఐఎం నాయకులు కూల్చివేతలను అడ్డుకుంటూ నానా హంగామా చేశారు... దీంతో విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కూల్చివేతల సమయంలో అక్కడికి వచ్చిన మజ్లీస్ నాయకులు అధికారుల విధుల్లో ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు ఎమ్మెల్సీతో పాటు స్థానిక కార్పొరేటర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబం ధించి ఘాన్సీ బజార్‌కు చెందిన ఎఐఎంఐఎం ఇన్‌చార్జ్ సాహిల్ అక్బర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. కేసు విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.






