Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చిరంజీవి మార్ఫింగ్ వీడియోలు.. యూట్యూబ్ ఛానెల్‌పై కేసు
posted on: May 27, 2026 12:50PM
.webp)
మెగా స్టార్ చిరంజీవి ఆరోగ్య పరిస్థితిపై అసత్య ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేసిన ఓ యూట్యూబ్ ఛానెల్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిరంజీవి తీవ్ర అనా రోగ్యంతో ఉన్నారని,ఆయన ఆరోగ్యం విషమించిందని తప్పుడు సమాచారంతో వీడియోలు ప్రచారం చేయ డంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
చిరంజీవి మార్ఫింగ్ వీడియోలపై చిరంజీవి తరఫు న్యాయవాది పోలీసులను సంప్రదించారు. ఆ వీడియోలకు సంబంధిత స్క్రీన్‌షాట్లు, వీడియో లింకులు, ఇతర ఆధారాలను పోలీసులకు సమర్పించారు. చిరంజీవి తరపున న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని పోలీసులు హెచ్చరించారు.ఇటీవల సెలబ్రిటీలపై ఫేక్ న్యూస్, మార్ఫింగ్ వీడియోలు రోజు రోజుకి పెరుగుతున్న నేప థ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించు కుంది.


.webp)



