మాజీ మంత్రి ఎర్రబెల్లిపై కేసు
posted on: Feb 2, 2026 1:56PM

తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును సిట్ విచారణకు పిలవడానికి నిరసనగా ఆదివారం (ఫిబ్రవరి 1)న భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఖమ్మం, వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించారు.
ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి వారు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి సహా 34 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీసు స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.



.webp)
.webp)

.webp)
.webp)


