అంబటి రాంబాబుపై కేసు నమోదు

posted on: Nov 13, 2025 8:03AM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ బుధవారం (నవంబర్ 12) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలోనూ నిరసన ర్యాలీలు నిర్వహించిన సంగతి విదితమే. అందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరులో ర్యాలీ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు విధులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.  అంబటి పోలీసుల విధులను అడ్డుకోవడమే కాకుండా, వారిని బెదరించారనీ, అలాగే అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని పేర్కొంటూ  బీఎన్ఎస్స సెక్షన్లు 132, 126(2), 351(3), 189(2), రెడ్‌ విత్‌ 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...