నటుడు చంద్రహాస్ పై కేసు
posted on: Feb 6, 2026 11:13AM

సినీ నటుడు చంద్రహాస్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా అసభ్యకరమైన పాటను పాడినట్లు ఆరోపణలతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ మేరకు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, సినిమా ఈవెంట్ సమయంలో ప్రజల సమక్షంలో అసభ్యకర పదజాలంతో కూడిన పాటను పాడడం వల్ల ప్రజల్లో అసహనం కలిగిందని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఉన్న వేదికపై ఈ తరహా ప్రవర్తన అనుచితమని కానిస్టేబుల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు చంద్రహాస్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 296, ఐటీ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, ఇదే ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కూడా చంద్రహాస్‌పై కేసు నమోదైంది.



.webp)


