బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై కేసు.!

posted on: Aug 21, 2026 12:25PM

 

నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు మర్రి జనార్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.   ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని నిరసిస్తూ ఆయన చేపట్టిన ఆందోళన ఇందుకు కారణమైంది.  

తెలంగాణలో  పేద మహిళలు, కుటుంబాలు ఆధారపడిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు నిధులు విడుదల కావడంలేదంటూ.. బీఆర్ఎస్   నిరసనకు దిగింది. ఈ పథకాల అమలును   వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ మర్రి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం (ఆగస్టు 20)  బీఆర్ఎస్ నాయకులు,  కార్యకర్తలు నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట  ధర్నా చేపట్టారు.  

పోలీసు అనుమతులు లేకుండా  నిర్వహించిన ధర్నా కారణంగా   ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో  రోగులు  ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   నిరసనకారులు ఆర్డీఓ   కార్యాలయంలోకి   అనుమతి లేకుండా ప్రవేశించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో  పోలీసులు  చర్యలు తీసుకున్నారు.   మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో పాటు  మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై శుక్రవారం (ఆగస్టు 21)  నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.  

Case againt BRS former MLA, Marri Janardhan Reddy,  BRS Protest, Telangana Politics, Nagarkurnool Rasta Roko

google-ad-img
    Related Sigment News
    • Loading...