Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఢిల్లీ అసెంబ్లీ గేటును కారుతో ఢీకొట్టిన నిందితుడు అరెస్ట్
posted on: Apr 6, 2026 6:34PM

దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది. కఠిన భద్రత మధ్య, ముసుగు ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కారుతో వి.వి.ఐ.పీ గేటును ఢీకొట్టి లోపలికి ప్రవేశించడం భద్రతా వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన తెల్లటి టాటా సియెర్రా ఎస్‌యూవీ అసెంబ్లీ గేటు నెంబర్–2 వద్దకు అత్యంత వేగంగా చేరుకుంది. సాధారణంగా కఠిన అనుమతులు ఉన్న వాహనాలకే అనుమతి ఇచ్చే ఈ గేటును, ముసుగు ధరించిన వ్యక్తి ఇనుప గేటు, బూమ్ బారియర్‌లను ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లాడు.
లోపలికి వెళ్లిన అనంతరం, ఆ వ్యక్తి కారు దిగి అసెంబ్లీ పోర్చ్ ప్రాంతానికి చేరుకుని, స్పీకర్ విజేందర్ గుప్తకు చెందినదిగా భావిస్తున్న వాహనం వద్ద ఒక పూల బొకే ఉంచాడు. వెంటనే తిరిగి కారులోకి చేరి, వచ్చిన వేగంతోనే భద్రతా ఏర్పాట్లను దాటుకుంటూ బయటకు పారిపోయాడు.ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు వెంటనే హై అలర్ట్ ప్రకటించాయి. ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్యక దళాలు, ఫోరెన్సిక్ బృందాలు అసెంబ్లీ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పటికీ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనలో ఉపయోగించిన కారు సర్బ్జిత్ సింగ్ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనం యజమానే నడిపాడా? లేక మరెవరైనా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.సెంట్రల్ రేంజ్ స్పెషల్ కమిషనర్ అనిల్ శుక్లా, లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమిషనర్ రవీంద్ర యాదవ్ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.
అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన కారు, సుమారు 2:15 గంటల సమయంలో ఓ రిక్షా కార్మికుడిని ఢీకొట్టినట్లు సమాచారం. బాధితుడి స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేశారు. నిందితుడి ప్రయాణ మార్గాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పగటిపూట, సాయుధ భద్రత మధ్య ఉన్న అసెంబ్లీ వంటి హై-సెక్యూరిటీ జోన్‌లోకి ఒక వ్యక్తి కారుతో ప్రవేశించి, తిరిగి సులభంగా బయటపడటం భద్రతా లోపాలను బహిర్గతం చేసింది. నిందితుడు అక్కడ బొకే ఎందుకు ఉంచాడు? ఇది నిరసనా? వ్యక్తిగత సందేశమా? లేక భద్రతా వ్యవస్థను పరీక్షించడానికేనా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.



.webp)


