రోడ్డు ప్రమాదంలో కారు దగ్ధం

 

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అతి వేగంగా వెడుతున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు.

డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న ఎనిమిది మందీ సురక్షితంగా బయటపడ్డారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కారు రోడ్డుకు అడ్డంగా పడిదగ్ధం కావడంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu