అమెరికాలో కారు ప్రమాదం...మాజీ ఎంపీ సతీమణికి తీవ్ర గాయాలు

posted on: Jun 3, 2026 8:45PM

 

కుమార్తె ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన కుటుంబానికి అనుకొని ప్రమాదం ఎదురైంది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి, ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ సుచి యాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కీని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎమ్‌డీ కోర్సులో చేర్పించి, అక్కడి నుంచి న్యూయార్క్‌కు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. వర్షం కారణంగా డాక్టర్ సుజి ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో డాక్టర్ సుచి యాష్కీ కి తీవ్ర గాయాలయ్యాయి. 

వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఆమెకు పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, చికిత్స పొందుతూ కోలుకుంటు న్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమార్తెను ఎమ్‌డీ కోర్సులో చేర్పించేందుకు వెళ్లిన సందర్భంగా లగేజీ ఎక్కువగా ఉండటంతో మధుయాష్కీ గౌడ్, డాక్టర్ సుచి యాష్కీ వేర్వేరు కార్లలో ప్రయాణించినట్లు తెలిసింది. 

ఈ క్రమంలో డాక్టర్ సుచి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.ప్రమాదం జరిగిన సమయంలో మధు యాష్కీ మరో వాహనంలో ఉన్నారు. ఇటీవల డాక్టర్ గగన యాష్కీ న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మధుయాష్కీ గౌడ్ అమెరికా వెళ్లారు. కాగా, ఆయన భారత్‌కు తిరిగి రావాల్సి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. అయితే డాక్టర్ సుచి యాష్కీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...