కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

posted on: Feb 9, 2026 6:25PM

 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంచిర్యాల బస్టాండ్ సమీపంలో ప్రచారం కొనసాగుతుండగా, ఎమ్మెల్యే కాన్వాయ్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకు రావడంతో స్థానికంగా కలకలం రేపింది. అయితే, కాన్వాయ్‌లోని వాహనాల డ్రైవర్లు వెంటనే అప్రమత్తంగా స్పందించడంతో ప్రమాదం తీవ్రత తగ్గింది. అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో బస్సు అదుపు తప్పి, కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు డీకొట్టుకోవడం తో స్వల్పంగా నష్టం వాటిల్లింది. 

ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగించిందని స్థానికులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...