Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్పీడ్ పోస్ట్‌లో మెడిసిన్ పేరుతో గంజాయి.. రూ.5 కోట్ల డ్రగ్స్ గుట్టు రట్టు..!
posted on: Jul 2, 2026 6:21PM
.webp)
పోస్టాఫీసు నుంచి స్పీడ్ పోస్ట్‌లో వచ్చే పార్శిల్‌లో మందులు ఉంటాయని భావిస్తారు. కానీ అదే స్పీడ్ పోస్ట్‌ను అడ్డుగా చేసుకుని దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ) ఛేదించింది. జార్ఖండ్ కేంద్రంగా 21 రాష్ట్రాల్లో డ్రగ్స్ నెట్‌వర్క్ నడుపుతున్న ఈ ముఠాలో కీలక నిందితుడు సత్యం మిశ్రాను అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన సత్యం మిశ్రా.. పెయింటర్, లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ డ్రగ్స్ వ్యసనానికి బానిసయ్యాడు. అనంతరం తన సోదరుడు శుభమ్ మిశ్రా, బంధువులు, సహచరులతో కలిసి గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించాడు.
జార్ఖండ్‌లో గంజాయిని సేకరించి, "పార్శిల్‌లో మెడిసిన్ ఉంది" అంటూ పోస్టాఫీసుల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కేరళ, రాజస్థాన్ సహా 21 రాష్ట్రాలకు పంపిస్తు న్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుని, "మ్యాంగో", "స్టిక్", "ఫ్లవర్" వంటి కోడ్ పదాలతో గంజాయి పరిమాణాలను సూచిస్తూ వ్యాపారం సాగించేవారు.
రోజుకు 80 నుంచి 100 ఆర్డర్లు పూర్తి చేస్తూ, నెలకు రూ.30–35 లక్షలు, ఏడాదికి రూ.4 నుంచి 5 కోట్ల వరకు టర్నోవర్ సాధించినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైలోనే వీరికి వెయ్యికి పైగా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు తేలింది.హైదరాబాద్‌కు వచ్చిన రెండు గంజాయి పార్శిళ్ల ఆధారంగా హెచ్-న్యూ పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఈ భారీ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు కొనుగోలుదారులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. ఇండియా పోస్ట్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిన ఈ పార్శిళ్లు రైళ్లు, విమానాల ద్వారా ఎలాంటి స్కానింగ్ లేకుండానే గమ్యస్థానాలకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోస్టల్, కొరియర్ వ్యవస్థల్లో భద్రతా లోపాలపై సంబంధిత శాఖలకు నివేదిక పంపను న్నట్లు అధికారులు తెలి పారు.కొరియర్ సేవలను దుర్వినియోగం చేసే డ్రగ్స్ ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రజలు తమ పేరుపై వచ్చిన అనుమానాస్పద పార్శిళ్ల గురించి వెంటనే పోలీసు లకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.



.webp)


