Latest News

అమెరికా ఆధిపత్యానికి చెల్లుచీటీ.. కెనడా ప్రధాని మార్క్ కార్నీ

posted on: Jan 21, 2026 8:23AM

ప్రపంచ ఆర్థిక వేదిక   సాక్షిగా అమెరికా ఆధిపత్యానికి ఇక చెల్లు చీటియేనని  కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ సంచలన ప్రకటన చేశారు.   దశాబ్దాలుగా అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అంతర్జాతీయ వ్యవస్థ ఇక అంతమైనట్లేనని ఆయన కుండబద్దలు కొట్టేశారు.  అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాద, ఆధిపత్య ధోరణికి  బలిపశువులు కాకుండా దేశాలు తమను తాము రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని  మార్క్ కార్నీ అన్నారు.

అంతర్జాతీయ నియమ నిబంధనలన్నవి అగ్రరాజ్యం లేదా శక్తిమంతుల అవసరాలకేనని, అవి తమకు అవసరమైనప్పుడు నిబంధనల నుంచి మినహాయింపులు పొందటం, అదే సమయంలో ఇతర దేశాలపై వాటిని బలవంతంగా రుద్దడం మామూలైపోయిందని పేర్కొన్న ఆయన, ఇన్నాళ్లూ అమెరికా ఆధిపత్యం వల్ల కలిగిన ప్రయోజనాలు ఇప్పుడు కనుమరుగయ్యాయన్నారు.  

ఆర్థిక అనుసంధానం అభివృద్ధికి మార్గం కాకుండా పోయిందనీ,  అగ్రరాజ్యానికి ఇతర దేశాలను లొంగదీసుకునే ఆయుధంగా తయారైందని మార్క్ కార్నీ తీవ్రస్థాయిలో విమర్శించారు.  సుంకాలు, సరఫరా గొలుసులను అడ్డుపెట్టుకుని  అగ్రరాజ్యం చిన్న దేశాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నదన్నారు. అగ్రదేశాధినేత డొనాల్డ్  ట్రంప్ గ్రీన్లాండ్ అంశంలో ఇతర దేశాలపై టారిఫ్ యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో కార్నీ చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. . 

google-ad-img
    Related Sigment News
    • Loading...