Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సమస్యలు పరిష్కరిస్తాం.. సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్
posted on: Apr 22, 2026 12:57PM
.webp)
సమ్మె విరమించాలని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులను కోరారు. మొండివైఖరితో సమ్మెకు వెళ్లడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతుందన్న ఆయన, సమస్యలకు సమ్మె పరిష్కారం కాదన్నారు.
చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
నాలుగు వారాల్లోగా పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాలలో 29 అంశాలు తక్షణమే పరిష్కరించదగినవిగా గుర్తించామని చెప్పిన మంత్రి మిగిలిన అంశాలను కూడా పరిష్కరిస్తామనీ, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలనీ ఆర్టీసీ కార్మికులను కోరారు.






