బడ్జెట్‌‌లో అప్పు ఎంత ఉందో చెప్పలేదు : మాజీ మంత్రి బుగ్గన

posted on: Feb 14, 2026 6:11PM

 

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌ స్పీచ్‌లో అసత్యాలు చెప్పారని.. అసెంబ్లీలో అబద్దాలు చెప్పటం పెద్ద నేరమని బుగ్గన ఆరోపించారు. ఈ బడ్జెట్‌ కొత్తదనం లేదన్నారు.  ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్‌ను రూపొందించారు. అసలు అప్పు ఎంత ఉందో చెప్పడం లేదని ఆయన తెలిపారు. 

ఏయే రంగాలకు బడ్జెట్‌లో ఎంత కేటాయించారో చెప్పలేదని.. గతేడాది బడ్జెట్‌ బుక్‌ చూసినట్టే ఉందని బుగ్గన అన్నారు. వైసీపీ హయాంలో 9శాతం వృద్ధి సాధించాం. గతేడాది ఆదాయం లక్షా 28 వేల 126కోట్లు చూపించారు. సవరించిన ఆదాయం లక్షా 11 వేల 865 చూపించారు. మూడు నెలల్లో 44,500 కోట్లు వస్తుందని చెప్పడం నమ్మేలా లేదని ఆయన విమర్శించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...