Latest News

యువత ఆకాంక్షలకు అద్దంపట్టేలా బడ్జెట్.. నిర్మలా సీతారామన్

posted on: Feb 1, 2026 10:24AM

కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ లోక్ సభలో తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.  వికసిత్ భారత్ దిశగా  ముందుకు సాగుతున్నామన్న నిర్మలాసీతారామన్..ఈ బడ్జెట్.. యువశక్తి బడ్జెట్ అన్నారు. ప్రపంచ మార్కెట్‌తో పోటీపడేలా బడ్జెట్ ను రూపొందించినట్టు  చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా  అనిశ్చిత పరిస్థితులున్నాభారత్ ఆర్థిక వృద్ధి కొనసాగుతోందన్నారు.

 ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన అడుగులు పడుతున్నాయన్నారు.  ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకుని,  ప్రజల ఆకాంక్షలను అందుకోవడమే లక్ష్యంగా నిలకడగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్యం తరువాత తొలి సారిగా ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నా నిర్మలా సీతారామన్ ఏడు శాతం వృద్ధితో ముందుకు సాగుతున్నామన్నారు. 

పవిత్ర మాఘపూర్ణిమ రోజున బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు చెప్పిన ఆమె యువత ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్ ను రూపొందించినట్లు చెప్పారు, అలాగే పేదలు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల అభివృద్ధి కోసం పెద్ద పీట వేసినట్లుచెప్పారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...