Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆదాయపన్నులో మార్పులు లేనట్లే!
posted on: Feb 29, 2016 11:47AM
.jpg)
దేశవ్యాప్తంగా బడ్జెట్ను ఆసక్తిగా గమనిస్తున్న మధ్యతరగతి ప్రజల నెత్తిన బండ పడింది. ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఇప్పటి వరకూ ఉన్న 2,50,000 పరిమితిని 3,00,000 వరకూ పెంచుతారని ఆశిస్తున్నవారికి అడియాశే మిగిలింది. ఆదాయపు పన్ను పరిమితులలో ఎలాంటి మార్పులూ ఉండవని తేల్చిపారేశారు మంత్రివర్యులు.
- 87A కింద 'ఇంటి అద్దె భత్యానికి' (house rent allowance) ఇచ్చే మినహాయింపుని 24,000 నుంచి 60,000 వరకూ పెంచడం ఒక్కటే మధ్యతరగతికి కాస్త ఊరటనిచ్చే అంశం.
- ఇంటి రుణాలకు ఇచ్చే పన్ను మినహాయింపుని మరో 50,000 పెంచారు. ఇది ఇటు రియల్ ఎస్టేట్ రంగానికీ, అటు సొంత ఇంటి కోసం కలలు కనేవారికీ కొంత సంతోషానికి గురిచేసే అంశం.
- కార్పొరేట్ పన్నుని మాత్రం ఊహించినట్లుగానే ప్రస్తుతం ఉన్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు.
- నూతనంగా ప్రారంభించే కంపెనీలకు ఐదేళ్లపాటు టాక్స్ హాలీడేని ప్రకటించారు ఆర్థిక మంత్రి.
- ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించి ఎలాంటి సవరణలూ చేపట్టబోమని స్పష్టం చేశారు అరుణ్ జైట్లీ!
మొత్తానికి మధ్య తరగతి మనుషులను ఊరించి ఊరించి ఉసూరుమనిపించినట్లైంది ఈ బడ్జెట్!


.jpg)



