బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్‌కు 14 రోజుల రిమాండ్

posted on: Apr 24, 2026 7:37PM

 

 

కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వాదోపవాదనలు పూర్తైన తర్వాత మెజిస్ట్రేట్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు కూకట్పల్లి పరిధిలోని దయార్గూడలో చోటుచేసుకుంది. టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినే టర్ గుండమల్ల రాజేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 23న మధ్యాహ్నం సుమారు 12:45 గంటల సమయంలో కూకట్‌పల్లిలోని తన నివాసంలో ఉన్న రాజేంద్ర కుమార్ ఇంటికి, భారత్ రాష్ట్ర సమితి సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ అనుచరులతో కలిసి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌లో తనపై చెడు ప్రచారం ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తూ, అతనిపై దాడి చేశారని ఆరోపించారు. పిడిగుద్దులతో కొట్టడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరించారని తెలిపారు. అంతేకాదు, ఘటనను మొబైల్‌లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించగా ఫోన్‌ను లాక్కుని నేలపై పడేసి ధ్వంసం చేశారని చెప్పారు. ఈ సమయంలో స్థానికులు అక్కడికి చేరుకో వడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న మేడ్చల్– మల్కాజ్‌గిరి పరిధిలోని 12వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు, మన్నే క్రిషాంక్ సహా 8 మందికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...