కాశీలో హైదరాబాద్ వాసులు ఆత్మహత్య

posted on: Feb 11, 2026 10:44AM

ఉత్తరప్రదేశ్‌లోని పవిత్రక్షేత్రం అయిన కాశీలో హైదరాబాద్‌ వాసులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరూ అన్నాచెళ్లెళ్లు. వీరి ఆత్మహత్యకు కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది.   హైదరాబాద్  లక్డీకాపూల్ ప్రాంతానికి చెందిన గణేష్ గౌడ్, ఆయన  సోదరి లక్ష్మీదేవి కాశీలోని ఓ హోటల్ గదిలో విగతజీవులుగా పడి ఉండటం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచేసింది.

ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గణేష్ గౌడ్, లక్ష్మీదేవి గత నాలుగు రోజులుగా వారణాసి కాంట్ ప్రాంతంలోని  సిట్ ఇన్ హోటల్‌లో బస చేశారు. హోటల్ రిజిస్టర్‌లో తమ వివరాలు నమోదు చేసి గదిని అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. అయితే  వీరిరువురూ మంగళవారం (ఫిబ్రవరి 10) ఉదయం నుంచీ తమ గదిలోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది  పోలీసు లకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు  తెరిచి లోపలికి వెళ్లి చూడగా, ఇద్దరూ నేలపై పడి ఉండడం గుర్తించారు. వారి నోటి నుంచి నురగ కారిన ఆనవాళ్లు కనిపించాయి. గదిలోనే ఒక పాయిజన్ బాటిల్ ఉంది.  దీంతో వీరిరువురూ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వారణాసికి బయలుదేరారు.  అనుమానాస్పద స్థితిలో మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...