Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జైస్వాల్ మనసుదోచిన బ్రిటిష్ సుందరి మ్యాడీ హామిల్టన్
posted on: Apr 9, 2026 2:38PM
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ, తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కే మైదానంలో తన బ్యాటింగ్ పరాక్రమంతోనే కాకుండా, ఇప్పుడు వ్యక్తిగత జీవితం ద్వారా కూడా వార్తల్లోకెక్కుతున్నాడు. యశశ్వి ఒక విదేశీ భామతో ప్రేమలో ఉన్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆ లక్కీ లేడీ ఎవరంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
జైశ్వాల్ ఒక విదేశీ యువతితో తరచుగా కనిపిస్తుండటంతో అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఆమె పేరు మ్యాడీ హామిల్టన్. బ్రిటిషర్ అయిన ఈమెతో జైస్వాల్ ప్రేమలో ఉన్నాడని చెబుతున్నారు. వీరిద్దరి మధ్యా గత నాలుగేళ్లుగా పరిచయం ఉందని సమాచారం.
మ్యాడీ హామిల్టన్ గురించి సోషల్ మీడియాలో పరిమిత సమాచారమే ఉన్నప్పటికీ, జైస్వాల్‌కు ఆమె అత్యంత సన్నిహితురాలని అంటున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వీరిద్దరి మధ్యా గత నాలుగేళ్లుగా.. అంటే 2022 నుంచీ మంచి అనుబంధం ఉందని నెట్టింట వార్తలు హల్ చెల్ చేస్తున్నాయి. ఇక 2024 ఐపీఎల్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లను చూసేందుకు మ్యాడీ స్టేడియానికి రావడంతో మొదటిసారి వీరి అనుబంధం గురించి ప్రపంచానికి తెలిసింది. 2025లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో శతకం బాదిన తర్వాత గ్యాలరీలో ఉన్న మ్యాడీ వైపు చూస్తూ సైస్వాల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, హార్ట్ ఎమోజీని చూపించడం కెమెరా కంటికి చిక్కడంతో వీరి బంధం మరింత ప్రస్ఫుటంగా అందరికీ తెలిసింది.
అతి చిన్న వయసులోనే కటిక పేదరికం నుంచి స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన జైస్వాల్ ప్రస్తుతం అటు కెరీర్ పరంగానూ, ఇటు వ్యక్తిగత జీవితం పరంగానూ ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మ్యాడీ హామిల్టన్ ఆయనకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్నట్లు సమాచారం. ఈ యువ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, మైదానంలో వారు పంచుకున్న భావోద్వేగాలు వారి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుతున్నాయి.






