Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోదీనే యుద్దాన్ని ఆపగలరంటున్న ఇరాన్ ప్రెసిడెంట్
posted on: Mar 22, 2026 5:51PM

బ్రిక్స్ కూటమికి ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న భారత్.. స్వాతంత్ర పాత్ర పోషించి ఇరాన్‌పై దురాక్రమణల్ని అడ్డుకునే చర్యలు చేపట్టాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ కోరుతున్నారు. విదేశీ జోక్యం లేకుండా పశ్చిమాసియా దేశాలు ఓక ప్రాంతీయ భద్రత వ్వవస్థగా ఏర్పడాలని ప్రతిపాదించారు. మసౌద్‌తో మోడీ శనివారం (21-3-26) ఫోన్లో మాట్లాడారు. అణ్వాయుధాలు సమీకరించుకోకుండా అడ్డుకునేందుకే తమపై సైనిక దాడికి దిగినట్లు అమెరికా చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
దివంగత సుప్రీం నేత ఖమేనీ అణ్వాయుధాలను తీవ్రంగా వ్యతిరేకించారని, వాటి అభివృద్ధికి ఎలాంటి ముందడుగు వేయకూడదంటూ పాలనపరమైన, మతపరమైన ఆదేశాలు జారీ చేశారని మసౌద్ చెప్పినట్లు ఇరాన్ విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. నౌకాయాన స్వేచ్ఛను కాపాడాలని, ఆయా మార్గాలు సురక్షితంగా తెరిచి ఉండేలా చూడాలని మోడీ ఇప్పటికే నొక్కి చెప్పారు.


.webp)
.webp)


