Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫేక్ సర్టిఫికేట్ కేసులో లంచం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇద్దరు పోలీసు అధికారులు
posted on: Apr 8, 2026 8:58AM
.webp)
నకిలీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కేసులో కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని బెదిరించి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు పోలీసు అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
శంషాబాద్ విమానాశ్రయం ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ కనకయ్య, ఎస్‌ఐ సిద్ధేశ్వర ఒక నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు విచారణలో భాగంగా బాధిత కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 15 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేనని బాధితులు ప్రాధేయపడ్డారు. అయితే చివరికి పోలీసులకు, బాధితులకు మధ్య 2 లక్షల రూపాయలకు డీల్ కుదిరింది.
ఈ విషయాన్ని బాధితులు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ పన్నిన వలలో ఇన్‌స్పెక్టర్ కనకయ్య, ఎస్‌ఐ సిద్ధేశ్వర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.






