Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్రహ్మోస్ ఒక భౌగోళిక ఆస్తి.. ఎంత వరకూ నిజం?
posted on: Jun 16, 2026 3:36PM

చాప్టర్ 1
ఆపరేషన్ సింధూర్‌లో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి యుద్ధంలో కాంబాట్–వాలిడేటెడ్ ఆయుధంగా తన సామర్థ్యాన్ని నిరూపించిన తర్వాత, ఆసియా, గల్ఫ్, లాటిన్ అమెరికా దేశాలు వరుసగా కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచాయి. ఇప్పుడు అదే వ్యవస్థను, క్షిపణుల కొరతతో ఉన్న రష్యా సైన్యం కూడా అధికారికంగా పరిశీలించడం, భారత రక్షణ ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మలుపు తీసుకున్నట్టయ్యింది.
చాప్టర్ 2
ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా వంటి ఇండో పసిఫిక్ దేశాలు.. బ్రహ్మోస్‌ను చైనా సప్లైడ్ సిస్టమ్స్‌కు ప్రత్యామ్నాయంగా, నాటో షరతులు లేని, కాంబాట్–వాలిడేటెడ్ డిటరెన్స్ ప్లాట్‌ఫామ్ గా చూస్తున్నాయి. ఒక్క బ్యాటరీ తీరప్రాంతంలో నిలబడటం, ప్రత్యర్థి నౌకాదళ ప్రణాళికలను పూర్తిగా మార్చే స్థాయి వ్యూహాత్మక ప్రభావాన్ని కలిగిస్తోంది.
చాప్టర్ 3
ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ దిగుమతిదారుల్లో ఒకటైన భారత్, ఇప్పుడు అదే రష్యాకు- తన దీర్ఘకాల భాగస్వామికి.. సహ–అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణిని సరఫరా చేసే స్థాయికి చేరడం, ఇంపోర్టర్ నుంచి ఎక్స్‌పోర్టర్ గా భారత రక్షణ ప్రస్థానం పూర్తి వలయాన్ని పూర్తి చేసిన సంకేతం ఇస్తోంది.
బ్రహ్మోస్ జననం నుంచి కాంబాట్–వాలిడేషన్ వరకు చూస్తే.. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రాజెక్టు 1990వ దశకం చివర్లో భారతదేశం- రష్యా సంయుక్త ఉపక్రమంగా ప్రారంభమైంది. భారత DRDO, రష్యా NPO మషినోస్ట్రోయేనియా కలిసి ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఎయిరో స్పేస్ జాయింట్ వెంచర్‌లో భారత్‌కు 50.5శాతం వాటా, రష్యాకు 49.5శాతం వాటా కలిగి ఉంది.
ఇంతకీ ఈ క్షిపణి శక్తి సామర్ధ్యాలు ఎలాంటివో పరిశీలిస్తే.. మాచ్ 3+ వేగం, సుమారు మూడు రెట్లు శబ్ద వేగం
లో–ఎల్టిట్యూడ్ ఫ్లైట్ ప్రొఫైల్ కలిగి ఉంటుంది. ఫైర్–అండ్–ఫర్గెట్ సామర్థ్యం, ల్యాండ్, సీ, ఎయిర్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ప్రయోగం వంటి లక్షణాలతో ప్రపంచంలో కార్యాచరణలో ఉన్న అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులలో ఒకటిగా నిలిచింది బ్రహ్మోస్.
ప్రారంభ దశలో బ్రహ్మోస్‌ను ప్రధానంగా భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం కోసం స్ట్రాటజిక్ అసెట్ గా అభివృద్ధి చేశారు. ఎగుమతి అవకాశాలు ఉన్నప్పటికీ, యుద్ధంలో ఉపయోగం జరగకపోవడంతో, అంతర్జాతీయ మార్కెట్లో అది పేపర్–కేపబిలిటీ స్థాయిలోనే ఉండిపోయింది.
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించడంతో, భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్–పరిపాలిత కాశ్మీర్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలపై కచ్చితత్వంతో కూడిన ప్రతీకార దాడులు ప్రారంభించింది.
ఈ ఆపరేషన్‌లో.. 15–19 బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించారు. పాకిస్తాన్ 13 ప్రధాన ఎయిర్‌బేస్‌లలో 11 ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఒక్క క్షిపణి కూడా ఇంటర్‌సెప్ట్ కాలేదు. పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో, వేకువ జామున 4:30 కి రిటైలరీ టోరీ స్ట్రైక్ ప్లాన్ చేసినప్పటికీ, బ్రహ్మోస్ దాడులు ముందుగానే ఆ సామర్థ్యాన్ని నిర్వీర్యం చేశాయని అంగీకరించినట్లు కొన్ని మీడియా విశ్లేషణలు చెబుతున్నాయి.
ఈ యుద్ధ ప్రవేశం బ్రహ్మోస్‌కు కాంబాట్ వేలిడేషన్ అనే అత్యంత కీలక ముద్రను వేసింది. ఫ్యాక్టరీ టెస్ట్‌లు, సిమ్యులేషన్లు ఇవ్వలేని విశ్వసనీయతనిచ్చింది.
బ్రహ్మోస్- తొలి విదేశీ వినియోగదారు ఎవరని చూస్తే.. 2022లో ఫిలిప్పీన్స్ 375 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంతో బ్రహ్మోస్ తీరప్రాంత రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన తొలి దేశంగా నిలిచింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా–ఫిలిప్పీన్స్ మధ్య ఉన్న సముద్ర వివాదాల నేపథ్యంలో, బ్రహ్మోస్.. తీరప్రాంత రక్షణ, సముద్ర భద్రత, చైనా నౌకాదళ కదలికలపై డిటరెన్స్ కోసం కీలక వ్యవస్థగా పరిగణించబడుతోంది.
2026 మేలో సింగపూర్‌లో జరిగిన షాంగ్రీ లా- డైలాగ్ లో భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, వియత్నాంకు బ్రహ్మోస్ సరఫరా ఒప్పందం సంతకం అయిందని, ఇండోనేషియాతో ఒప్పందం- ఫైనల్ స్టేజెస్ లో ఉందని వెల్లడించారు. వియత్నాం ఒప్పందం విలువ.. సుమారు రూ. 60 వేల కోట్లుకాగా..
ఇండోనేషియా తీరప్రాంత యాంటీ షిప్ వేరియంట్లపై చర్చలు జరిగాయి. దక్షిణ చైనా సముద్రం, ఇండో–పసిఫిక్ సముద్ర మార్గాల్లో చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి, ఈ రెండు దేశాలు బ్రహ్మోస్‌ను నాన్ వెస్ట్రన్, నాన్ నాటో కండిషనాలిటీ గల కాంబాట్ వాలిడేటెడ్ సిసస్టమ్ గా చూస్తున్నాయి.
ఇంకా ఇతర ఆసక్తి గల దేశాలు ఎలాంటివో చూస్తే.. గ్రీస్, గల్ఫ్, లాటిన్ అమెరికా.. ఈ కోవలోకి వస్తాయి. కొన్ని మీడియా కథనాల ప్రకారం బ్రహ్మోస్ కొనుగోలు లేదా పరిశీలనలో ఉన్న దేశాల జాబితాలో
గ్రీస్ – మధ్యధరా సముద్రంలో ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రిసిషన్ స్ట్రైక్ సామర్థ్యాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఇక గల్ఫ్ దేశాల విషయానికి వస్తే- UAE, సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, ఈజిప్ట్ – సముద్ర భద్రత, కీలక మౌలిక సదుపాయాల రక్షణ ప్రధానంగా కనిపిస్తోంది.
ఇక లాటిన్ అమెరికా దేశాలైన – బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా – డిటరెన్స్ క్రెడిబిలిటీ కోసం ట్రై చేస్తున్నాయి. ఇవి ఇప్పటికీ చర్చల దశలో ఉన్నప్పటికీ, బ్రహ్మోస్ చుట్టూ ఏర్పడుతున్న క్యూను స్పష్టంగా చూపిస్తున్నాయి.
సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన ఫ్లీట్- 2026 అంతర్జాతీయ సముద్ర రక్షణ ప్రదర్శనలో, రష్యా కోరితే బ్రహ్మోస్ సరఫరా చేయడానికి తాము సిద్ధమని బ్రహ్మోస్ ఎయిరో స్పేస్ ప్రతినిధులు వెల్లడించారు.
రష్యా- పాత్ర ఏంటంటే అదిక్కడ బ్రహ్మోస్ కోడెవలపర్. దీర్ఘకాల రక్షణ భాగస్వామి అయినా, తన సొంత బలగాల కోసం ఈ వ్యవస్థను కొనుగోలు చేయాలని పరిశీలించడం, రెండు కీలక సంకేతాలు ఇస్తోంది.
ఇక రష్యా క్షిపణుల కొరత – ఉక్రెయిన్ యుద్ధం, దీర్ఘకాల కాన్ ఫ్లిక్ట్ వల్ల నిల్వలు తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. భారత సాంకేతిక విశ్వసనీయత – సహ–అభివృద్ధి చేసిన వ్యవస్థను, ఆపరేషనల్ యూజ్ కోసం తిరిగి కొనుగోలు చేయాలనుకోవడం ఇది ఇంపోర్టర్ నుంచి ఎక్స్‌పోర్టర్ గా భారత రక్షణ ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మలుపుగా కనిపిస్తోంది.
ఎగుమతి నియంత్రణ, జాయింట్ వెంచర్, రష్యా–పాశ్చాత్య ఉద్రిక్తతలు వంటి వాటిలో జాయింట్ వెంచర్ నిర్మాణం విషయానికి వస్తే.. బ్రహ్మోస్ ఎయిరో స్పేస్ భారత్ - DRDO, రష్యా- NPO పాత్ర కీలకం. ఇందులో భారత్- 50.5శాతం వాటా కాగా, రష్యా 49.5శాతం వాటా కలిగి ఉన్నాయి.
ఈ నిర్మాణం వల్ల.. లాభాలేంటో చూస్తే.. బ్రహ్మోస్ వెస్ట్రన్ సప్లై చైన్ కి బయట నాటో లింక్డ్ పొలిటికల్ కండీషన్స్ లేకుండా ఎగుమతులపై నిర్ణయాలు భారత్– రష్యా సంయుక్త సమ్మతితోనే జరగడం గుర్తించాల్సిన విషయం.
ఇక ఎగుమతి నియంత్రణ, MTCR, రేంజ్ పరిమితుల విషయానికి వస్తే.. మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమీ పరిమితుల కారణంగా.. బ్రహ్మోస్ ఎగుమతి వేరియంట్ల రేంజ్‌ను 290 కి. మీ పరిధిలోనే ఉంచారు.
ఇది MTCR ఉల్లంఘన ఆరోపణలను నివారిస్తుంది. ఎగుమతి దేశాలకు సరిపడే డిటెరెన్స్ కేపబిలిటీని సైతం ఇస్తుంది. ఇక రష్యా కొనుగోలు, పాశ్చాత్య ఆంక్షలు, లీగల్ సంక్లిష్టత విషయానికి వస్తే..
రష్యా.. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా US, EU, G7 ఆంక్షల కింద రక్షణ దిగుమతులు, సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి పుచ్చుకోవడం వంటి వాటిపై కఠిన నియంత్రణల నేపథ్యంలో, రష్యా బ్రహ్మోస్ కొనుగోలు.. పాశ్చాత్య ఆంక్షల పరిధిలోకి వస్తుందా? అనే ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి.
భారత్–రష్యా మధ్య గల డిఫెన్స్ కోపరేషన్ పై అదనపు సెక్యూరిటీ ఉంటుందా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతుంది. అయితే, బ్రహ్మోస్ ఇప్పటికే నాన్ వెస్ట్రన్, నాన్ నాటో సప్లై చైన్ లో ఉన్నందున, లీగల్ సంక్లిష్టత ఉన్నప్పటికీ, అది పూర్తిగా అసాధ్యం కాదు—ఇది భవిష్యత్ దౌత్య, రెగ్యులేటరీ చర్చలపై ఆధారపడి ఉంటుంది.
భారత్.. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ దిగుమతిదారుల్లో ఒకటి. ఇప్పుడు కాంబాట్ వాలిడేటెడ్- హైటెక్ మిస్సైల్ ఎక్స్ పోర్టర్.
వాటీజ్ బ్రహ్మోస్ అని చూస్తే.. మేక్ ఇన్ ఇండియా- ఆత్మనిర్భర్ భారత్- ఇండో–పసిఫిక్ డిటరెన్స్
వంటి వాదాలకు కాంక్రీట్ ప్రూఫ్ గా నిలుస్తోంది.
ఇండో–పసిఫిక్ రాజకీయ కోణం సంగతికి వస్తే.. ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా- చైనాతో సముద్ర వివాదాలు ప్రధానమైనవి. యూఎస్, వెస్ట్రన్ సిస్టమ్స్ పై పొలిటికల్ కండీషన్స్, ఎండ్ యూజ్ మానిటరింగ్ బ్రహ్మోస్ ద్వారా నాన్ వెస్ట్రన్ డెటరెన్స్ ఆర్కిటెక్చర్ నిర్మాణం సైతం ఉన్నట్టు కనిపిస్తుంది.
ఇది ఇండో–పసిఫిక్‌లో భారత్ ను ఒక రక్షణదాత పాత్రను బలపరుస్తోంది. చైనా–కేంద్రిత సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ కి ప్రత్యామ్నాయాన్ని ఇస్తోంది.
మీడియా కోణంలోంచి చూస్తే.. కొన్ని ప్రముఖ పత్రికలు, ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ కథనాన్ని విస్తృతంగా విశ్లేషించాయి. పాకిస్తాన్ హ్యాడ్ 30-45 సెకండ్స్ డెసిషన్ విండో, నాన్ ఆఫ్ మిస్సైల్స్ ఇంటర్ సెప్టెడ్, చైనీస్ సప్లైడ్ డిఫెన్సెస్ ఫెయిల్డ్ అంటూ సాగిన ఈ కథనాలు.. బ్రహ్మోస్‌ను సెల్ఫ్ మార్కెటింగ్ వెపన్ గా చిత్రీకరించాయి. కాంబాట్ వాలిడేషన్ ను ప్రీమియం ట్రస్ట్ ఫ్యాక్టర్ గానూ చూపించాయి.
ఆపరేషన్ సింధూర్ నుంచి రష్యా కొనుగోలు వరకు బ్రహ్మోస్‌ను పేపర్–కేపబిలిటీ నుంచి బ్యాటల్ టెస్ట్డె డిటరెంట్ గా మార్చింది. దీంతో 14కి పైగా దేశాలు ప్రొక్యూర్ మెంట్ చర్చల్లోకి వచ్చాయి.
ఇది భారత రక్షణ ఎగుమతుల క్రెడిబిలిటీని గణనీయంగా పెంచింది. కాంబాట్ వాలిడేటెడ్ సిస్టమ్స్ ని కేరీ ప్రీమియం ఆఫ్ ట్రస్ట్ అనే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ కాన్ సెప్ట్ ను బ్రహ్మోస్ ద్వారా ప్రపంచానికి చూపించింది.
రష్యా క్షిపణుల కొరత, బ్రహ్మోస్ ఎంపిక- ఉక్రెయిన్ యుద్ధం వంటి కోణాల్లోంచి చూస్తే.. రష్యా లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్ మిస్సైల్స్ నిల్వలను బాగా తగ్గించింది. కొత్త సిస్టమ్స్ అభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యంపై ఒత్తిడి పెంచింది. దీంతో రష్యా.. సహ–అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ను
తన సొంత బలగాల కోసం కొనుగోలు చేయాలని పరిశీలించడం, ఒకవైపు సాంకేతిక విశ్వసనీయత, మరోవైపు క్షిపణుల కొరత అనే రెండు వాస్తవాల కలయిక.. ఇందులో దాగి ఉన్నట్టు కనిపిస్తోంది.
భారత్.. ఇంపోర్టర్- కో–డెవలపర్- ఎక్స్‌పోర్టర్- కో–డెవలపర్‌కు ఎక్స్‌పోర్టర్ అనే పూర్తి వలయాన్ని బ్రహ్మోస్ ద్వారా పూర్తి చేసింది. ఇది ఒక స్పష్టమైన పాఠం నేర్పుతోంది. దేశాలు సాంకేతికతను దిగుమతి చేసుకోవడం ద్వారా కాదు. ఇతరులు కొనాలనుకునే స్థాయి సాంకేతికతను సృష్టించడం ద్వారా గౌరవాన్ని సంపాదిస్తాయని రుజువు చేసింది.
బ్రహ్మోస్ – ఆయుధం మాత్రమే కాదు, వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ ఆస్తి. బ్రహ్మోస్ ప్రపంచంలో కార్యాచరణలో ఉన్న అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులలో ఒకటి కావడమే ఇందుకు కారణం. ఆపరేషన్ సింధూర్‌లో ఇది పక్కాగా వర్కవుట్ కావడం, దాని ఎగుమతి సామర్ధ్యాన్ని మరింత గణనీయంగా పెంచింది.
ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా, గల్ఫ్, లాటిన్ అమెరికా వంటి దేశాలు.. తమ రక్షణాత్మక సామర్ధ్యాలను మరింత పెంచుకోవడం కోసం బ్రహ్మోస్‌ను కీలక భాగంగా చూస్తున్నాయి. రష్యా కూడా అదే వ్యవస్థను కొనుగోలు చేయాలని పరిశీలించడం, భారత సాంకేతిక సామర్థ్యానికి అత్యంత బలమైన ఎండార్స్ మెంట్ గా భావిస్తున్నారు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






