కూలిన కాలజ్జాని నివాసం... బ్రహ్మం గారి భక్తులు ఫైర్
posted on Oct 29, 2025 4:26PM

తన కాలజ్ఞాన ప్రబోధం ద్వారా భవిష్యత్తు గురించి చెప్పిన కాలజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం మొంధా తుఫాన్ తో కురుస్తున్న వర్షాలకు కూలిపోయింది. భక్తులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . కడపలో 400 ఏళ్ళనాటి నివాస గృహం దెబ్బతినడంతో మూసివేశారు కానీ పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడం,ఈ వర్షాలకు ఆ గృహం కూలిపోవడంతో బ్రహ్మంగారి భక్తుల మనోభావాలు దెబ్బలు దెబ్బతిన్నాయి. బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు ఆయనా నివాస గృహాన్ని కాపాడుకో లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మంగారి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారి నివాస గృహాన్ని సందర్శిస్తారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బ్రహ్మంగారి మఠం అభివృద్ధి చేస్తున్నామన్న అధికారులు నివాస గృహం పట్ల అలసత్వం వహించడంతోనే కూలిందని భక్తులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నా నివాస గృహం కూలిపోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.