Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Brahmamudi: దుగ్గిరాల కుటుంబాన్ని లేపెయ్యాలని చూస్తున్న రుద్రాణి!
posted on: Feb 22, 2026 10:50AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-962 లో... కావ్య తన చేతులతో తులసి పాపని ఉయ్యాలలో వేస్తుంది. చాలా థాంక్స్ కావ్య నీ చేతులు మీదుగా వేసినందుకని తులసి చెప్తుంది. మీ బిడ్డ అయినా నా దగ్గర కొన్ని రోజులు పెరిగిందని కావ్య అంటుంది. నా బిడ్డని మీరు అపురూపంగా చూసుకున్నారని కావ్య అంటుంది.
ఆ తర్వాత అందరం భోజనం చేద్దాం పదండి అని మినిస్టర్ అంటాడు. అప్పుడే రుద్రాణి వస్తుంది. నువ్వు ఏంటే ఇక్కడ అని ఇందిరాదేవి తిడుతుంది. నేను మినిస్టర్ కి తెలుసు నన్ను పిలిచాడు.. మీరు వస్తున్నారని తెలిసి మిమ్మల్ని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చానని రుద్రాణి అనగానే నీ క్షమాపణ మాకేం అవసరం లేదని ఇందిరాదేవి అంటుంది. బయటకు వెళ్ళాక మీ విలువ తెలిసింది.. నాకు బ్రతకాలని లేదు మీరు నన్ను క్షమించనంటే హాయిగా చచ్చిపోతానని రుద్రాణి అంటుంది.
అప్పుడే ఆపు నీ నాటకాలు అంటూ అప్పు, కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. అప్పు, కళ్యాణ్ ఇద్దరికి చిన్న చిన్న గాయలవుతాయి. ఏమైందని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఈ రుద్రాణి మమ్మల్ని చంపెయ్యాలని చూసిందని జరిగింది మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. అసలు మినిస్టర్ గారికి పిల్లలని మార్చేయాలని సలహా ఇచ్చింది రుద్రాణి అని అప్పు చెప్తుంది. మినిస్టర్ గారు మారిపోయి తన బిడ్డని తను కాపాడుకున్నాడని అప్పు చెప్పగానే ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.
రుద్రాణిని ఇంట్లో అందరు తలొక మాట అంటారు. కావ్య మాత్రం ఏకంగా చెప్పుతో కొడుతుంది. నువ్వు ఇంకొకసారి కనిపించావంటే చంపేస్తామని అందరు వార్నింగ్ ఇస్తారు. నువ్వు వెళ్ళిపో నీ కడుపులో పుట్టినందుకు సిగ్గుగా ఫీల్ అవుతున్నామని రుద్రాణిని బయటకు నెట్టేస్తాడు రాహుల్.
ఆ తర్వాత రుద్రాణి వెళ్ళిపోయి జరిగింది తలుచుకోని అవమానం గా ఫీల్ అవుతుంది. కత్తితో పొడుచుకోబోతుంటే రాహుల్, రేఖ వస్తారు. ఏంటి మమ్మీ మా జీవితాలు చక్కదిద్దుతా అన్నావ్ ఇలా చేస్తున్నావని రుద్రాణి మనసు మారుస్తారు. దుగ్గిరాల కుటుంబం మొత్తం లేకుండా చెయ్యాలని ముగ్గురు ప్లాన్ చేస్తారు.
మరొకవైపు రుద్రాణి చేసిన దాని గురించి ఇంట్లో డిస్కషన్ చేస్తారు. రాహుల్, రేఖ వాళ్ళ ప్లాన్ లో భాగంగా బ్యాగ్ సర్దుకొని హాల్లోకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






