బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్

posted on: Feb 27, 2026 1:45PM

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గురువారం (ఫిబ్రవరి 26) రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనీ, దీంతో ఆయనను హుటాహుటిన రాత్రికి రాత్రే హైదరాబాద్ కు తరలించారు.

ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ప్రమాదమేమీ లేదనీ వైద్యులు తెలిపారు. కాగా బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ వార్త తెలియగానే వైసీపీ శ్రేణులలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.  ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. 

పలువురు నేతలు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...