Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జనసేన గూటికి బొత్స?.. ఉత్తరాంధ్రలో వైసీపీ ఖాళీయేనా?
posted on: Aug 3, 2026 1:28PM
.webp)
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైపీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణకు ఫ్యాన్ గాలి ఉక్కపోతగా మారిందా? వైసీపీని వీడి జనసేన గూటికి చేరనున్నారా? అన్న ప్రశ్నకు రాజకీయవర్గాల జరుగుతున్న చర్చ, వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి ఔనన్న సమాధానమే వస్తోంది.
2024 ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఆ ఎన్నికలలో ఘోర పరాజయంతో గద్దె దిగిన తరువాత వైసీపీ గ్రాఫ్ వేగంగా దిగజారిపోతోంది. తాజా సర్వేలు కూడా అదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ అధినేత దూకుడు పెంచినా ఫలితం ఉండటంలేదు. గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ జనసేన గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న వార్తలు జోరందుకున్నాయి.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు అవుతోంది. మిగిలిన పదవీ కాలంలో మరింత సమర్థవంతంగా పాలన అందిస్తూ పట్టు నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత కూడా పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు దూకుడు పెంచినా ఆశించినట్లుగా పుంజుకోలేకపోతున్నది. దీనికి తోడు రాజధాని, భోగాపురం వంటి కీలక విషయాలలో జగన్ ఏకపక్ష వైఖరితో వైసీపీ నేతలలో అసంతృప్తి పేరుకుంటోంది. దీంతో తమ రాజకీయ భవిష్యత్ విషయంలో ఆ పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ వైసీపీని వీడి జనసేన గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో దశాబ్దాలుగా తనకంటే ప్రత్యేక పట్టు ఉన్న బొత్స కుటుంబం వైసీపీకి దూరం అవ్వడమంటూ జరిగితే.. వైసీపీకి అది కోలుకోలేని దెబ్బ అవుతుందని పరిశీలకులు అంటున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స కుటుంబం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటాలు సాగించింది. ఈ నేపథ్యంలో బొత్సకు తెలుగుదేశంలోకి ఎంట్రీ లేకపోవడంతో బొత్స జనసేన వైపు దృష్టి సారించారంటున్నారు. ఇందుకు పవన్ కల్యాణ్ కూడా సుముఖంగా ఉన్నారనీ, చంద్రబాబు సైతం నో అబ్జెక్షన్ అన్నారని రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియలో అప్పడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరించారు. చిరంజీవితో బొత్సకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే పవన్ కల్యాణ్ తోనూ సత్సంబంధాలున్నాయి. ఆ పరిచయంతోనే బొత్స పవన్ కల్యాణ్ తో చర్చించి జనసేన ఎంట్రీకి మార్గం సుగమం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
AP Politics, AP News, YCP, Uttarandhra, Telegu News






