Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరణంలోనూ వీడని బంధం: ప్రేమ జంట బలవన్మరణం.. ఒకే చోట అంత్యక్రియలు
posted on: May 7, 2026 9:04AM
.webp)
ప్రేమించిన జంట పెళ్లి పీటలెక్కాల్సింది పోయి.. విధి వంచనతో కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతీ యువకులు చిన్నపాటి మనస్పర్థలతో తనువు చాలించిన ఘటన చెన్నూరులో తీవ్ర విషాదాన్ని నింపింది. బ్రతికి ఉన్నప్పుడు ఒక్కటి కాలేకపోయినా, మరణంలోనైనా వారిని విడదీయకూడదని భావించిన ఇరు కుటుంvబా సభ్యులు ఆ ప్రేమజంటకు ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించడం అందరినీ కదిలించింది.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన యోగేంద్ర కుమార్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యోగేంద్ర మరణ వార్త విన్న హేమశ్రీ గుండె పగిలింది. అతడు లేని లోకంలో తాను ఉండలేనని భావించి, తానూ బలవన్మరణానికి పాల్పడింది.
ఈ ప్రేమకథ విషాదాంతం కావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. అయితే.. వారి మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమను ఆలస్యంగానైనా గుర్తించిన ఇరు కుటుంబాలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాయి. మరణం తర్వాత కూడా వారిని విడదీయకూడదని భావించి.. గ్రామ శివారులోని ఒకే ప్రాంతంలో పక్కపక్కనే ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించారు.


.webp)


