బిడ్డ గుర్తింపునకు తండ్రి పేరు,కులం అవసరం లేదు.. బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు

posted on: Feb 20, 2026 8:00AM

బాంబే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పితృస్వామ్య విధానాన్ని తోసిరాజంటూ.. బిడ్డ గుర్తింపునకు తల్లి పేరు చాలంటూ సంచలన తీర్పు వెలువరించింది. ఒక అత్యాచార బాధితురాలి బాలిక స్కూల్ రికార్డుల నుంచి తండ్రిపేరు తొలగించాలని ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి.

మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన ఒక మహిళ తన 12 ఏళ్ల కుమార్తె తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై జరిగిన అత్యాచారం వల్లే పాప జన్మించిందని, ఆ తర్వాత నిందితుడు 2022లో జరిగిన ఒక సెటిల్మెంట్‌లో బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిచ్చాడని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే.. స్కూల్ రికార్డుల్లో తండ్రి పేరు, ఆయన కులం ఉండటం వల్ల తన కుమార్తె సామాజికంగా ఇబ్బందులు ఆ బాలిక తల్లి పిటిషన్ లో పేర్కొన్నారు.

తన కుమార్తెకు తన కులాన్నే వర్తింప చేయాలని కోరారు.  ఈ పిటిషన్ విచారించిన బాంబే హై కోర్టు.. ఒంటరి తల్లిని బిడ్డకు పూర్తిస్థాయి సంరక్షకురాలిగా గుర్తించడం రాజ్యాంగం కల్పించిన హక్కని పేర్కొంది.  బాధ్యతలేని తండ్రి కులాన్ని బిడ్డ మోయాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టింది. తల్లి సామాజిక హోదానే బిడ్డకు వర్తిస్తుందనీ, స్కూల్ నిబంధనల పేరుతో ఈ మార్పులు చేయలేమని విద్యాశాఖ అధికారులు చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది.  సుప్రీంకోర్టు కూడా పాస్‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రాల విషయంలో తండ్రి పేరు కాకుండా తల్లి అనుమతితోనే జారీ చేయవచ్చని గతంలో తీర్పు ఇచ్చింది. తాజాగా ముంబై   హైకోర్టు కులం విషయంలోనూ స్పష్టత ఇవ్వడం గమనార్హం.  

google-ad-img
    Related Sigment News
    • Loading...