ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు

posted on: Apr 17, 2026 2:40PM

 

హైదరాబాద్‌లోని ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని స్టేషన్ అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. 

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.కొంతసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, చివరికి ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన ఫేక్ కాల్‌గా తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ బెదిరింపు కాల్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...