Latest News

మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదరింపు

posted on: Mar 23, 2026 12:38PM

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని  జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు  కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు  కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లుగా జిల్లా జడ్జికి సోమవారం (మార్చి 23) ఈ-మెయిల్  సందేశం పంపించారు. ఈ మెయిల్ ను గమనించిన న్యాయమూర్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని విస్తృత తనిఖీలు చేపట్టారు.

భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులోకి ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మైక్ ద్వారా ఎవ్వరు కూడా కోర్టు లోపలికి వెళ్లకుండదని హెచ్చరికలు జారీ చేసి, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...