కాశ్మీర్ లో భారీ పేలుడు.. 13 మంది మృతి
posted on Nov 15, 2025 8:30AM
.webp)
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం (నవంబర్ 14) అర్ధరాత్రి సంభవించిన ఈ పేలుడులో కనీసం 12 మంది మరణించారు. అర్ధరాత్రి సమయంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ కారు పేలుడు సంఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం.
కాగా నౌగామ్ పోలీసు స్టేషన్ లో జరిగిన పేలుడులో గాయపడిన వారిని ఇస్పత్రికి తరలించారు. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఇలా ఉండగా పేలుడు జరిగిన నౌగామ్ సీఎస్ భద్రతా పరంగా అత్యంత కీలకమైన, సున్నితమైనదని అధికారులు చెబుతున్నారు. ఆ కారణంగానే వ్యూహాత్మకంగా ఉగ్రవాదులు ఈ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారని భావిస్తున్నారు. కాగా పేలుడు అనంతరం ఆ పోలీసు స్టేషన్ పరిశర ప్రంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.