Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రైల్వే ట్రాక్ పై పేలుడు.. పంజాబ్ లో ఒకరు మృతి
posted on: Apr 28, 2026 10:10AM

పంజాబ్ లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. పటియాలా జిల్లా పరిధిలోని ఢిల్లీ-రాజ్‌పురా రైల్వే లైన్‌పై సోమవారం (ఏప్రిల్ 27) రాత్రి సంభవించిన పేలుడులో ఒక గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. అయితే ఆ వ్యక్తి పేలుడు కారణంగా మరణించాడా? మరైదైనా కారణమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పటియాలాలోని శంభు-అంబాలా మార్గంలో రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. గూడ్స్ రైళ్లు ఎక్కువగా ప్రయాణించే ఈ మార్గంలో పేలుడు ధాటికి రైల్వే పట్టాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ , రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే ఒక వ్యక్తి మృతదేహం ఛిద్రమైన స్థితిలో పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది.
ఆ వ్యక్తి మరణానికి, ఈ పేలుడుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడు పేలుడు పదార్థాలను అమర్చడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. ఈ ఘటనను విద్రోహ చర్యగా అధికారులు భావిస్తున్నారు. రైల్వే కార్యకలాపాలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా ఈ పేలుడు జరిగిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు.


.webp)
.webp)


