వందేభారత్ రైళ్లు పేల్చేస్తాం.. బెదరింపు లేఖతో రైల్వే శాఖ అప్రమత్తం
posted on: Feb 7, 2026 11:43AM

రైల్వే శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నడుపుతున్న వందేభారత్ రైళ్లను పేల్చివేస్తామంటూ వచ్చిన లేఖ కలకలం సృష్టించింది. దేశ వ్యాప్తంగా నడుస్తున్న వందేభారత్ రైళ్లను పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి రైల్వే అధికారులకు పంపిన పంపిన లేఖలో హైదరాబాద్‌లో నివసిస్తున్న నలుగురు జిహాది గ్రూపు సభ్యులు వందేభారత్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని భారీ పేలుళ్లకు కుట్ర పన్నారని పేర్కొన్నాడు.
ఈ నెల 3వ తేదీన పోస్టు ద్వారా రైల్వే జీఎంకు ఈ లేఖ అందినట్టు అధికారులు తెలిపారు. వందే భారత్ రైళ్లు వెళ్లే పట్టాలపై బాంబులు అమర్చి పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లేలా పథకరచన చేశారంటే ఆ లేఖలో అగంతకుడు పేర్కొనడం తీవ్ర ఆందో ళన కలిగిస్తోంది. అంతే కా కుండా ఈ కుట్రకు సంబంధించిన నలుగురు వ్యక్తుల పేర్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ లేఖ అందిన వెంటనే అలర్టైన రైల్వే అధికారులు విషయాన్ని పోలీసులకు, భద్రతా సంస్థలకు తెలియజేశారు. అలాగే వందేభారత్ రైళ్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్లే, హైదరాబాద్ కు వచ్చే వందేభారత్ రైళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్‌ల వద్ద బాంబ్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రయాణికుల లగేజీని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. లేఖలో పేర్కొన్న వ్యక్తులు, ఆరోపణలపై పోలీసులు దర్యాప్తుఇది నిజమైన బెదిరింపా? లేక కేవలం తప్పుడు సమాచారంతో కలకలం సృష్టించేందుకా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. సైబర్, పోస్టల్ ఆధారాలతో లేఖ పంపిన అగంతకుడిని గుర్తిం చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వందేభారత్ రైళ్లకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తున్నట్టు తెలిపారు.






