Latest News

స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం

posted on: Jan 22, 2026 4:55PM

స్టీల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది.   బలోడా బజరార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం (జనవరి 22)న సంభవించిన పేలుడులో ఆరుగురు ఘటనాస్థలంలోనే మరణించగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.

 స్టీల్ ఫ్యాక్టరీలోని బొగ్గు కొలిమి ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం.  సమాచారం తెలుసుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తొలుత స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. మెరుగైన చికిత్స కోసం బిలాస్‌పూర్ సిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్యామ్ బిహారీ జైస్వాల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...