ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరి మృతి

వికారాబాద్ జిల్లాలో జరిగిన భారీ పేలుడులో ఒకరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా లక్ష్మిదేవిపల్లిలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం (నవంబర్ 6) రాత్రి ఈ పేలుడు సంభవించింది.

సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ఫర్నేస్ పేలిపోవడంతో  అలీ, రషీద్ అనే ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అలీ మరణించాడు. రషీద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu